నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో 8.85 కోట్ల రూపాయలతో నిర్మించిన నూతన భవనాన్ని అనకాపల్లి ఎంపీ డాక్టర్ భీశెట్టి సత్యవతి, నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ప్రారంభించారు. నూతన భవనానికి వైఎస్ఆర్ భవన్ గా నామకరణం చేశారు. తొలుత ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్,మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి తదితరులకు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య విప్లవం వచ్చిందని వివరించారు. రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కాలేజీలు మంజూరు చేయగా ఇప్పటికే అయిదు ప్రారంభమయ్యాయని చెప్పారు.
Discussion about this post