పార్లమెంట్ ఎన్నికల నగారా మోగడంతో పోలింగ్ నిర్వహణకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. అయితే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మొన్నటి ఎన్నికల ఫలితాల దెబ్బ నుంచి ఇంకా కొలుకున్నట్లు కనిపించడం లేదు. ఫలితంగా ఖమ్మం లో ఆ పార్టీ కేడర్ ఇంకా నిస్తేజంలోనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు కలకళలాడిన జిల్లా కేంద్రలోని పార్టీ కార్యాలయం తన మొఖం చూసే కార్యకర్తలు లేక వెలవెలబోతోంది.
బిఆర్‌ఎస్ పార్టీ ఖమ్మం అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావును ప్రకటించినా.. ఆయన శిబిరంలోనూ ఎన్నికల హడావుడి ఏమాత్రం కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతామన్న ధీమాతో దూసుకుపోయిన ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను గత ఎన్నికల్లో ఓటమి పలకరించేసరికి తట్టుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు వెంట తిరిగిన కీలక నాయకులకు సైతం ఆయన దూరంగా ఉంటున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. ఇక ఇదే అంశానికి సంబందించిన మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు.
Discussion about this post