డేటా ఎంట్రీ పేరిట కంబోడియా దేశం వెళ్లేందుకు విశాఖ ఎయిర్ పోర్టుకు వచ్చిన ఇద్దరు యువకులను పోలీసులు రక్షించారు. హ్యూమన్ ట్రాఫికింగ్ వలలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తిరిగి రప్పిస్తున్న తరుణంలో అక్కడ జరిగిన తీరు చూసి పోలీసులు నిర్ఘాంతపోయారు. కంబోడియాలో చిక్కుకున్న భాదితులతోనే వారి మిత్రులకు కాల్స్ చేయించి కంబోడియా రప్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు తిప్పికొట్టారు. గాజువాక నుండి ఇద్దరు యువకులు కంబోడియా వెళ్లేందుకు రాగా.. అదే సమయంలో కంబోడియా భాదితులు తిరిగివచ్చారు. వారు మీడియాతో మాట్లాడుతుండగా అది చూసిన యువకుల కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు యువకులను పోలీసులు అడ్డుకుని ఎయిర్ పోర్టు నుంచి బయటికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
వినాయక చతుర్థి | గణేష్ చతుర్థి శుభాకాంక్షలు
గణేష్ చతుర్థి ఉత్సవాలలోకి లోతుగా మునిగి గణేష్ చతుర్థి, వినాయక చతుర్థి అని కూడా పిలుస్తారు, ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక సమూహాలకు గొప్ప ప్రాముఖ్యత కలిగిన వేడుక....
Discussion about this post