ఆర్సీబీ ఓటమి జీర్ణించుకోలేక,విజయాలతో దూసుకుపోతుంది అనే సమయంలో మరోసారి బొక్కబొర్లాపడింది.ఈ సాలా నమ్దే కప్ అన్న నినాదం బరిలోకి దిగిన ఆర్సీబీ మరోసారి అభిమానుల్ని నిరాశపర్చింది. కీలక ఎలిమినేటర్ మ్యాచులో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడి.. ఇంటికి పోయింది .ఈ నాకౌట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ 19 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.ప్రతి ఐపీఎల్ సీజన్‌కి ముందు, ‘ఈ సాలా కప్ నమ్దే’ అనే ఆర్సీబీ స్లోగన్ మారుమోగిపోతుంది. ఈ సారి కూడా అదే జోష్‌లో ఆర్సీబీ (RCB) ప్లే ఆఫ్ బరిలో నిలిచింది. అయితే మరోసారి బొక్కబొర్లాపడింది. టీమ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్లు కీలక మ్యాచులో చేతులేత్తేశారు. దీంతో అభిమానులు వీరిని ట్రోల్ చేస్తున్నారు.ఇక, ఈ సీజన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిన ప్లేయర్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇలాంటి చెత్తాట ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు.. గ్లెన్ మాక్స్వెల్. ఈ సీజన్లో మాక్స్వెల్ ఒక్కసారి కూడా ఇంప్రెస్ చేయలేదు. దీంతో మాక్స్వెల్ ఫామ్‌పై మాజీ క్రికెటర్లు ఫైరయ్యారు.ఈ సీజన్లో ఆడిన పది మ్యాచుల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. కీలక ఎలిమినేటర్ మ్యాచులో డకౌటయ్యాడు. అతని పేలవమైన ఆట తీరు ఆర్సీబీ విజయావకాశాలను తగ్గించిందని చెప్పవచ్చు. మ్యాక్స్‌వెల్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మెన్‌గా చెబుతారు. అయితే ఈ హిట్టర్ తన స్థాయికి తగ్గట్లు బ్యాటింగ్ చేయలేదు.ఈ సీజన్లో మ్యాక్స్‌వెల్‌కి ఇది నాలుగో డకౌట్. దీంతో.. చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇది ఓవరాల్‌గా 18 వ డకౌట్. దీంతో.. అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా దినేష్ కార్తీక్‌తో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో.. ఆర్సీబీ అభిమానులు తెగ మండిపడుతున్నారు. ఆస్ట్రేలియాకు ఎన్నోసార్లు సింగిల్ హ్యాండ్‌తో విజయాలు అందించిన మ్యాక్సీ ఇంత దారుణంగా ఆడటంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు.మ్యాక్స్‌వెల్‌కి ఇచ్చే రూ.14.25 కోట్లు వేస్ట్ అని.. ఆర్సీబీకి పట్టిన అతిపెద్ద దరిద్రం అతడే అంటూ ఘాటు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు కూడా టెన్షన్లో ఉంది. ఇంత చెత్త ఫామ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్ టీ20 ప్రపంచకప్‌లో ఎలా ఆడతాడో అని ఆందోళన చెందుతుంది ఆస్ట్రేలియా జట్టు.
Discussion about this post