తెలంగాణా తాజా వార్తలు: రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం అప్పులు చేశారని బీఆర్ఎస్ పార్టీ పరస్పర ఆరోపణలు చేసుకుంటోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. రాష్ట్రాల మధ్య నీటి తరలింపు సమస్యను సృష్టించి పైశాచికానందం పొందాలని బీజేపీ పార్టీ చూస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ కూలిపోతుందని అనడం సరికాదన్నారు. జమిలి ఎన్నికలకు రామ్నాథ్ కోవింద్ కమిటీ అనుకూలంగా ఉన్నప్పటికీ, సీపీఎం మాత్రం వ్యతిరేకిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
Discussion about this post