బరితెగించిన ఇసుకమాఫియా ముఠా సభ్యులు అటవీశాఖ అధికారుల కారును వెనుక నుంచి ఢీ కొట్టారు. అయితే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా… ఇల్లందు అటవీశాఖ రేంజ్ పరిధిలో రాత్రి వేళల్లో కొనసాగిస్తున్న ఇసుక మాఫియాకు చెక్ పెట్టేందుకు అటవీ అధికారులుగట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇల్లందు డివిజన్ పరిధిలోని రోజుకొక ఎఫ్ ఆర్ ఓ, సిబ్బందితో రాత్రి వేళలో నిఘా ఉంచారు. ఈ క్రమంలో టేకులపల్లి మండలం సాయన్నపల్లి ప్రాంతంలో… రెండు ఇసుక ట్రాక్టర్లను ఇన్నోవా కారుతో అటవీ అధికారి… నలుగురు సిబ్బంది అడ్డుకునేందుకు ప్రయత్నించగా… ఇన్నోవా కారును ఢీ కొట్టారు. ఈ ఘటనలో అటవీశాఖ అధికారులకు ప్రమాదం తప్పగా… ఇన్నోవా కారు దెబ్బతింది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు రెండు ఇసుక ట్రాక్టర్లు పట్టుకొని ఇల్లందు అటవీశాఖ డిపో కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను డీఎఫ్ ఓ వెంకన్న తెలియచేశారు.
Discussion about this post