అసెంబ్లీ స్పీకర్ గా చేసిన తర్వాత మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించరనే సెంటిమెంటు ఏపీ రాజకీయాల్లో ఉంది. ఈ సెంటిమెంటే తమ్మినేని సీతారాంను కలచివేస్తుంది. ఇది చాలదన్నట్లు సొంతపార్టీ అభ్యర్థే తిరుగుబాటు బావుటా ఎగరేసి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేస్తుండటం సీతారాంకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అధికార సమయంలో సీతారాం భార్య వాణి అధికారులకు ఇచ్చిన వార్నింగ్ లు, కుమారుడు చిరంజీవి రౌడీయిజాలు కూడా ఓటర్ల పై ప్రభావం చూపుతాయోమోనని ఆయన వర్గం భయపడుతోంది.
ఆముదాల వలస సిట్టింగ్ ఎమ్మెల్యే, ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంకు అదే నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని సీఎం జగన్ ఖరారు చేశారు. అయితే ఆముదాలవలసలో గ్రూపు రాజకీయాలు తమ్మినేనికి చుక్కలు చూపుతున్నాయి. 2019 ఎన్నికల్లో 2024లో తనకు సీటు కేటాయిస్తానని సీఎం జగన్ హామీ ఇస్తేనే తాను సీతారాం గెలుపుకు కృషి చేశానని సువ్వారి గాంధీ చెప్పారు. హైకమాండ్ తనను మోసం చేసిందని ఆయనన ఆరోపించారు. అందుకే స్వతంత్ర్య అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు.
గాంధీ ప్రభావవంతమైన కాళింగ వర్గానికి చెందినవాడు. పొందూరు మండలంపై మంచి పట్టు ఉంది.
సొంత వర్గాన్ని మెయింటెన్ చేస్తూ పార్టీ కార్యక్రమాలను ఆయన సమాంతరంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్, తమ్మినేని డబుల్ గేమ్ రాజకీయ నాటకానికి తెరపడాలంటే తనకు ఓటు వేయాలని గాంధీ ప్రజలను కోరుతున్నారు. తమ్మినేనికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు ఎక్కువ మంది గాంధీని కలిశారు. దీంతో సీతారాంకు ఆందోళన ఎక్కువయ్యింది.
మరో మూడు నెలలు ఆగితేగాని ఎవరు ఏమిటన్నది తెలియదు.
Discussion about this post