శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అభివర్ణించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతి దేవిగా కొలువు వుంటుందని పురాణాలు చెపుతున్నాయి.
గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజోవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. చతుర్వేద స్వరూపమైన శ్రీ గాయత్రీదేవి తేజోవంతమైన అయిదు ముఖాలతో జ్ఞాన జ్యోతులను వెదజల్లుతూ ఉంటుంది. శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి శోభనమూర్తిగా కొలువై ఉంటుంది. దైవ శక్తులకే మూలాధారం శ్రీ గాయత్రీమాత.
ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్ అని భక్తితో ఉచ్చరించినంతటనే ఉపాసనాబుద్ది తేజోవంతం అవుతుంది. ఈ గాయత్రీదేవి అలంకారంలో అమ్మవారిని ఆరాధిస్తూ చతుర్వేద పారాయణ ఫలితం కలిగి సకల దురిత ఉపద్రవాలు పటాపంచలు అవుతాయి..
సకల మంత్రాలకూ మూలమైన శక్తిగా, వేదమాతగా పేరుగాంచి ముక్తా, విద్రుమ, హేమనీల, దవళవర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీ దేవి. ఈ తల్లి శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా, తిమూర్త్యాంశగా గాయత్రీదేవి వెలుగొందుతుంది. గాయత్రీ అమ్మవారిని దర్శించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది. తేజస్సు లభిస్తుంది.
పంచముఖాలు కలిగిన ఈ మాత పంచభూతాలకు ప్రతీక. విశ్వ క్షేమానికై గాయత్రీదేవి అర్చన అత్యంత ఆవశ్యకం. అందుచేతనే ఈ శరన్నవరాత్రులలో గాయత్రీదేవి ఉపాసన విశిష్టత కలిగింది.
Discussion about this post