తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్న తుమ్మల… నాడు ఎన్టీఆర్ నుంచి నేటి రేవంత్ సర్కార్ వరకు అనేక మంది మంత్రివర్గాలో కొనసాగుతోన్న నాయకులు. ఆరు పదుల వయసు దాటినప్పటికీ ఏమాత్రం తగ్గని ఒరవడి ఆయన సొంతం.
ఖమ్మం జిల్లా రాజకీయాలు గుర్తు చేసుకుంటే వినిపించే ప్రముఖ పేర్లలో తుమ్మల నాగేశ్వర్ రావు కూడా ఉంటారు. మంత్రి తుమ్మల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రస్తుతం గోదావరి వరదల వేళ కొన్ని ముఖ్య విషయాలు మంత్రి తుమ్మలకు మాత్రమే తెలుసు. గోదావరి వరదల గరించి చెప్పాలంటే 1986 ఎప్పటికీ గుర్తుండే ఏడాది. భారీ వరదల కారణంగా 75.6 అడుగులతో గోదావరి ఉధృతి ఎక్కువగా ఉండటం… 27 లక్షల క్యూసెక్కుల వరద ముంచెత్తిన ఆ జల విలయం… ఎప్పటికీ చేదు జ్ఞాపకమే.
1986 నాటి వరదల సమయంలో దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారాక రామారావు కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాడు తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. ఈ ముగ్గురూ కలిసి నాటి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. నాడు జల విలయం కళ్ళారా చూసిన తుమ్మల చాలా ముందుచూపుతో గోదావరి జలగండం నుంచి శాశ్వత పరిష్కారం కోసం కరకట్ట నిర్మాణానికి రూపకల్పన చేసారు. అదే నేటికీ భద్రాచలానికి రక్షణ కవచంగా పని చేస్తోంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటు పాలేరు నుంచి పర్ణశాల వరకు… అటు అశ్వారావుపేట నుంచి గుండాల, పర్ల వరకు లో లెవల్ బ్రిడ్జిలు, హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు జల దిగ్బంధంలో ఉండే భద్రాచలం డివిజన్ కు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగకుండా చేశారు. కూనవరం గోదావరి శబరీ సంగమం వద్ద హై లెవల్ బ్రిడ్జి… తాలిపేరు ప్రాజెక్ట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి… వెంకటాపురం బ్రిడ్జి నిర్మాణంతో దశాబ్దాల కష్టాలు తీర్చారు. మన్యం వీరునిగా ఏజెన్సీ అభివృద్ధి ప్రధాతగా తుమ్మల చరిత్ర పుటల్లో నిలిచిపోయారు. 1986 గోదావరి వరద విలయం నుంచి భద్రాచలం డివిజన్ ప్రగతి బాట పట్టేలా తుమ్మల, ఎన్టీఆర్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో ఉండి… కార్యదక్షతతో నేటి వరకు పని చేస్తున్నారు.
2022 జులై వరదల సమయంలో తుమ్మల అధికారంలో లేక భద్రాచలం డివిజన్ వాసులు అనేక ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రేవంత్ క్యాబినేట్ లో కొనసాగుతూ… భద్రాచలం వద్ద గోదావరి వరదల కారణంగా జరిగే నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతున్నారు. ఇప్పటి వరకు 33 ఏళ్లుగా మంత్రిగా ఉన్న అనుభవంతో తుమ్మల చెప్పిన ప్రతి విషయం కూడా విజన్ ఉన్న విషయమే అవుతోంది. అయితే తుమ్మల తనతో ఉండే వారితో తరచూ ఒక మాట చెబుతుంటారు. పదవులు శాశ్వతం కాదు… చేసిన పనులే చరిత్రలో నిలుస్తాయని… చెప్పడమే కాదు… ఆచరణలో చేసి చూపించారు కూడా. భక్త రామదాసు ప్రాజెక్ట్ తో కూసుమంచి, తిరుమలాయ పాలెం మండలాల సాగునీటి కష్టాలు దూరం చేశారు. సీతారామ ప్రాజెక్ట్ తో ఉమ్మడి ఖమ్మం జిల్లా సశ్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ కు ఆయన రూపకల్పన చేశారు.
కొండరెడ్ల జీవితాల్లో వెలుగులు నింపి నాగరికత వైపు నడిపించారు తుమ్మల. పామాయిల్ సాగుకు బాటలు వేసి రైతుని రాజుగా మార్చారు. జాతీయ రహదారులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పట్టించారు. ఇంతటి ముందుచూపుతో పని చేస్తూ పోతారు కాబట్టే తుమ్మల నాగేశ్వర్ రావును అందరూ విజన్ ఉన్న నేత అంటారు.
Discussion about this post