టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుసతీమణి నారా భువనేశ్వరి తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర ముగింపుకు వచ్చేసింది. ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న ‘నిజం గెలవాలి’ ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8వేల 500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.
Discussion about this post