ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతరగా మేడారం సమ్మక్క సారలమ్మల జాతర పేరుగాంచింది. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు కోటిన్నర మందికిపైగా భక్తులు వరదలా పోటెత్తుతారు. కోరిన కోర్కెలు తీర్చే వన దేవతలను దర్శించుకునేందుకు క్యూ కడతారు. ఇంత ప్రత్యేకత ఉంది కనుకే ..ఈ జాతరను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది. మహా జాతర మొత్తం ఆదివాసీల సంస్కృతీ సంప్రదాయాల ప్రకారమే జరుగుతుంది. ఇందులో ఎలాంటి మార్పులు, చేర్పులకు అవకాశమే ఉండదు. ఇంత పెద్ద మహా జాతర ఎలా మొదలవుతుంది.. ఎలా జరుగుతుంది.. ఎలా పూర్తవుతుందన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. అందుకే జాతర తీరు తెన్నులపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్ ను ప్రత్యేకంగా అందిస్తోంది.
Discussion about this post