అనంతపురంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాజీ మంత్రి పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు ఓటరు జాబితాలో ఉన్న ఓట్లతోనే ఎన్నికలు జరిగాయని, ఇప్పుడు ఆ ఓట్లలో పదివేల ఓట్లను తీసివేశారని అన్నారు. దొంగ ఓట్లు వేయించుకోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. 25 సంవత్సరాలు అధికారంలో ఉన్నా కనీసం రాప్తాడు కోసం అసెంబ్లీలో చర్చించలేదని పరిటాల సునీతపై మండిపడ్డారు.
Discussion about this post