ఏపీలో 90 శాతంపైగా స్థానల్లో గెలుపు తీరాలకు వెళ్లి టీడీపీ కొత్త అధ్యాయాన్ని సృష్టించింది… ఎన్నో సంచనలనాలకు, ఎన్నో రికార్డులకు ఎల్లోపార్టీ కేంద్రబిందువు అయ్యింది. బాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేస్తూ..సీనియర్ ఎన్టీఆర్ రికార్డ్‌ను సమం చేస్తున్నారు. ఈ విజయం వెనుక చంద్రబాబు ఎలాంటి కార్యాచరణ చేశారు.. ఎలాంటి వ్యూహాలు పన్నారు.. గెలుపు కోసం బాబు వేసిన అడుగులేంటి..?
ఏపీలో టీడీపీని స్థాపించి ఓ ప్రభంజనం సృష్టించిన మహానేత సీనియర్ ఎన్టీఆర్.. రాష్ట్రాన్ని అత్యధిక కాలం పాలించిన సీఎంగా కూడా ఆయనకు మంచి పేరుంది. ఆ రికార్డును ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తిరగ రాశాని కొన్ని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకుని ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. వీరి పొత్తు రెండు పార్టీలకు కలిసొచ్చింది. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కల్యాణ్ తనతోపాటు తమ పార్టీ నాయకులందరిని గెలిపించుకున్నారు. జనసేన మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. ఇది వైసీపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. దీంతో భవిష్యత్తులో గాజు గ్లాస్ సింబల్‌కు కూడా ఢోకా లేకుండా చేసుకుంది. ముఖ్యంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ఓటర్లను ఆకర్షించింది. దీంతో పాటు చివరి క్షణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తెరపైకి తెచ్చి విన్నింగ్ కోసం దారేసుకున్నారు. అంతే కాకుండా చంద్రబాబు అరెస్ట్ అప్పటి పరిణామాల నుంచి వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందనొచ్చు. వీటితో పాటు పథకాల అమలు విషయంలో ప్రభుత్వం వెనుకబడిందనే ప్రచారం కూడా టీడీపీకి ప్లస్ అయ్యింది.
ఏపీలో పోల్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్టగా చంద్రబాబుకు మంచి పేరుంది. ఆయన చాలా తెలివిగా అడుగులేశారు. అవే టీడీపీ గెలుపునకు కారణమయ్యాయి. మీడియా, పోలింగ్ ఇలా అన్నింటిని అద్భుతంగా మేనేజ్ చేశారు.. ఎప్పటి నుంచో నిర్దేశించుకున్న భారీ లక్ష్యా్న్ని సునాయసంగా సాధించారు. కూటమిగా పోటీ చేసి 164 స్థానాల్లో గెలుపొందారు… టీడీపీ పోటీ చేసిన 144 స్థానాల్లో 135 సెగ్మెంట్లలో విజయఢంకా మోగించింది. టీడీపీ పోటీ చేసిన 90 శాతానికిపైగా స్థానాల్లో విజయ కేతనం ఎగరేసింది.
కనివినీ ఎరుగని రీతిలో కూటమికి అప్రతిహత విజయం కట్టబెట్టారు. అంతా టీడీపీ అనుకున్నట్లే జరిగింది. మొదటి నుంచి అంతా తమకే అనుకున్న వైసీపీకి భంగపాటు తప్పలేదు. చరిత్రలోనే చంద్రబాబు సువర్ణాక్షరాలతో ఈ విజయాన్ని లిఖించుకున్నారు. టీడీపీకి వచ్చిన ఈ విజయం వెనుక నాటి అరెస్ట్ కూడా ముఖ్య భూమిక పోషించిందనొచ్చు. 14 ఏళ్లు సీఎంగా.. పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నేతను అరెస్ట్ చేయడం మాములు విషయం కాదు. 53 రోజుల పాటు జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టారు… అప్పుడే ఏపీ ప్రజలు డిసైడ్ అయ్యారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి.
అసెంబ్లీలో శపథం చేసిన్నట్లుగానే గౌరవసభలో బాబు అడుగు పెడుతున్నారు. తన భార్య భువనేశ్వరిని అవమానించినప్పుడు కుంగిపోయారు. ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయారు. ఆ తర్వాత జైలులో పెట్టారు. అప్పుడే చంద్రబాబు డిసైడ్ అయ్యారు. సీఎంగా గెలిచాకే అసెంబ్లీలో అడుగు పెడతానన్నారు. అప్పుడు శపథం చేసిన్నట్లే తాజాగా ఆయన గౌరవ సభలోకి వెళ్తున్నారు.
కూటమి కట్టిన నుంచి గెలిచే వరకు పవన్ వేసిన ప్రతి అడుగూ ప్రత్యేకమే.. బీజేపీతో కలిసి పోటీ చేయడం నుంచి వైసీపీ ఎన్ని హేళనలు చేసినా ముక్కవోని దీక్షతో పవన్ ముందుకు కదిలారు. ఎన్ని అవమానాలు ఎదురైనా పవన్ మాత్రం సక్సెస్ అయ్యారు. చంద్రబాబు, పవన్ బంధం ఎప్పటికీ ప్రత్యేకం అని రాష్ట్ర ప్రజలు చెప్పుకుంటున్నారు. దత్తపుత్రుడనే మాటలతో విమర్శలు చేసినా ఆ విమర్శలను తట్టుకుని పవన్ కెరీర్లో ముందడుగు వేశారు. 2024 ఎన్నికలు ఏపీ ప్రజలకు ఎప్పటికి గుర్తుండిపోయేలా జరిగాయి. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక ఫుల్ సక్సెస్ అయ్యింది. వీరి జోడి రాబోయే కాలంలో ఏపీ అభివృద్ధికి దోహదపడుతుందని ఎంతో మంది ఆశపడుతున్నారు. వారి ఆశలు నిజమవ్వాలనుకుందాO…
Discussion about this post