పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ కల్కి 2898 AD. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, కమల్ హసన్, దీపికా పదుకునే, దిశా పటానీ వంటి భారీ తారాగణంతోనే ఈ సినిమా సంచలనం సృష్టించింది. చిత్రం ప్రారంభమైన మొదటి రోజు నుంచి రోజుకోరకమైన ప్రత్యేకత బయటికి వచ్చి నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుండగా తాజాగా కోట్లు ఖర్చుపెట్టి మరీ రెడీ చేసిన బుజ్జిని రివీల్ చేశారు. ఈ బుజ్జికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇప్పుడు చిత్రంలో ఓ కీలక రోల్ ప్లే చేస్తున్న బుజ్జి అనే కారును పరిచయం చేయడం కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడమే ఆశ్చర్యానికి గురి చేసింది. హాలీవుడ్లో మాత్రమే తరచూ జరిగే ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు తెలుగునాట జరగడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కార్యక్రమంతో ఇప్పుడు సర్వత్రా కారు గురించిన స్పెషాలిటీస్, ఫీచర్స్ గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు బాగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ బుజ్జి గురించిన ఓ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.. ఇక విషయానికి వస్తే.. ఇండియన్ స్క్రీన్‌పై ఇంతవరకు రానీ, ఎవరు చేయని విధంగా ఓ భారీ సినిమా చేస్తున్నామని… మా ఆలోచనలకు, సినిమాకు తగిన కారు కావాలి సాయం చేయండంటూ దర్శకుడు నాగ్ అశ్విన్ గత సంవత్సరం మన ఇండియన్ వ్యాపారవేత్త, మహేంద్ర యజమాని ఆనంద్ మహీంద్రాకు ట్వీట్ చేయడం ఆయన వెంటనే స్పందించడంతో మొదటిసారి ఈ విషయం వెలుగులోకి వచ్చి అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు.
ఇంకేముంది ఆనంద్ మహేంద్రా కంపెనీ, జాయోమ్ ఆటోమోటివ్ కంపెనీల సాయంతో తమిళనాడులోని కోయంబత్తూరులో ఈ బుజ్జిని రెడీ చేశారు. ఇందుకోసం దాదాపు రూ.7 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ కారు 6 టన్నుల బరువుతో ఉండగా దానికి ప్రత్యేకంగా డిజైన్ చేయించిన టైర్లు మాత్రమే ఉపయోగించారని తెలుస్తోంది. సుమారు 6075 మి.మీ పొడవు.. 3380మి.మీ వెడల్పు, 2418 మి.మీ ఎత్తుతో ఈ టైర్లను ప్రఖ్యాత సీయెట్ కంపెనీ తయారు చేసింది. వాటికి 34.5 ఇంచుల రిమ్‌ను వాడడం ఇందులో విశేషం. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH లను వినియోగించినట్లు నెట్టింట వార్తలు సైతం చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Discussion about this post