తెలంగాణను దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం గల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణా రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ సీనియర్ లీడర్లు హాజరైయ్యారు.రైతులకు నీళ్లు, పెట్టుబడి సహాయం అందించి, రైతుల ఆత్మహత్యలను తగ్గించామని జగదీశ్ రెడ్డి అన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు మొదలైయ్యాయని విమర్శలు గుప్పించారు.
Discussion about this post