మీకు తెలుసా.. రెండేళ్లలో భారత్ లో ముగ్గురు ప్రధానులు ఉన్నారు.. 1996లో బీజేపీ 161 సీట్లు సాధించి లోక్ సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బీహారీ వాజ్ పేయ్ ప్రధాని అయ్యారు. కాని ఆయన ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. ఆతర్వాత 13 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా హెచ్ డీ దేవగౌడ 1996 జూన్ 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు అంటే 324 రోజులున్నారు. ఆపై కాంగ్రెస్ తన మద్దతును ఆయనకు ఉపసంహరించుకోగా ఇంద్ర కుమార్ గుజ్రాల్ 1997 ఏప్రిల్ 21 నుంచి 1998 మార్చి 19 వరకు ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. రెండేళ్లలో మళ్లీ జరిగిన ముందస్తు ఎన్నికల్లో పూర్తి స్థాయి విజయం సాధించిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 19 నుంచి 2004 మే 22 వరకు వాజ్ పేయ్ ప్రధానిగా పూర్తికాలం పనిచేశారు. రెండేళ్లలో ముగ్గురు ప్రధానలులుండటానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం…
దేశంలో మొట్టమొదటిసారిగా 1996లో బీజేపీని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా భారత రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ అటల్ బిహారీ వాజ్‌పేయిని ఆహ్వానించారు. మే 15న ప్రమాణస్వీకారం చేసిన కొత్త ప్రధానమంత్రికి పార్లమెంటులో మెజారిటీని నిరూపించుకోవడానికి రెండు వారాల సమయం ఇచ్చారు. మే 31న జరిగిన మొదటి విశ్వాస ఓటింగ్‌కు కొన్ని వారాల ముందు, ప్రాంతీయ పార్టీలు, ముస్లిం పార్టీల నుండి మద్దతును పొందేందుకు BJP ప్రయత్నించింది. అయితే మూడున్నర ఏళ్ల ముందు బీజేపీ బాబ్రి మసీదును కూల్చివేశారు. దీంతో బీజేపీని అందరూ దూరం పెట్టారు. మహారాష్ట్రలోని బాల్ థాకరే ఆధీనంలోని శివసేన, పంజాబ్ లోని ప్రకాశ్ సింగ్ బాదల్ ఆధ్వర్యంలోని శిరోమణి అకాలిదళ్ బీజేపీతో జతకట్టాయి. మే 28న, వాజ్‌పేయి 545 మంది పార్లమెంటు సభ్యులలో 200 మంది కంటే ఎక్కువ మంది నుండి మద్దతును ఏర్పాటు చేయలేరని అంగీకరించారు. తద్వారా విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి బదులుగా రాజీనామా చేసి, తన 13 రోజుల ప్రభుత్వాన్ని ముగించారు.
Discussion about this post