మిచాంగ్ తుఫాన్ కారణంగా ఉమ్మడి మెదక్, ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడ చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది.
రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మెదక్ జిల్లాలో IKP సెంటర్లలోని ధాన్యం తడిసిపోయే అవకాశాలు ఉన్నాయి. రైతులు తాము పండించిన ధాన్యాన్ని రక్షించుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. గత పదిహేను రోజులుగా IKP సెంటర్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వరి, పత్తి పంటలకి తీవ్ర నష్టం కలిగింది. రైతులు వరి కోసి రోడ్డుపై ఆరబోసారు. దీంతో ధాన్యం పూర్తిగా తడిసి పోయింది. ధాన్యం తడవకుండా రైతులు పట్టలు కప్పిన, చాలా చోట్ల ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని, దెబ్బతిన్న పంటలను పరిశీలించిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
మాక్ లైవ్ లింక్
Discussion about this post