సాగర్ నగర్‌లోని వాటర్ ట్యాంకు సమీపంలో పులి సంచరిస్తున్నట్లు వదంతులు తలెత్తాయి. సుమారు ఉదయం 3 గంటల సమయంలో ఇద్దరు మహిళలు నడక సాగిస్తుండగా.. దూరంలో పులిలాంటి జంతువును చూసి పరుగులు తీశారు. ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో వారు ఆ ప్రాంతంలో కొన్నిఅడుగు జాడలను గుర్తించారు. అవి పులి అడుగులే అంటూ ప్రచారం జరగడంతో అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని వేలిముద్రలను పరిశీలిస్తున్నారు.
Discussion about this post