భారత్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే టైగర్ ట్రయంఫ్-24 విశాఖలో ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో.. ఇరు దేశాలకు చెందిన త్రివిధ దళాలు పాల్గొంటాయి. ట్రయంఫ్లో మానవతా సాయం, విపత్తుల నిర్వహణ, సంయుక్త విన్యాసాలు ప్రధానాంశాలుగా ఉంటాయి.
ఈ నెల 18 నుంచి 25 వరకు హార్బర్ ఫేజ్, ఆ తర్వాత దశలో సముద్ర విన్యాసాలు నిర్వహిస్తారు. భారత్ తరఫున హెలికాప్టర్లతో కూడిన యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, సైనిక దళాలు, వైమానిక దళానికి చెందిన విమానాలు పాల్గొననున్నాయి. అమెరికా తరఫున నేవీ నౌకలు, మెరైన్ బృందాలు, సైనిక దళం పాల్గొంటున్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని నేవీ వర్గాలు తెలిపాయి.
Discussion about this post