ఏప్రిల్ 8న సంపూర్ణ సూర్యగ్రహణం సంభవిస్తోంది. అయితే భారత్ లో ఈ సూర్యగ్రహణాన్ని చూడలేము. భారత కాలమానం ప్రకారం ఏప్రిల్ 8 రాత్రి 9:12 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 1:25 గంటలకు సూర్యగ్రహణం ముగుస్తుంది. అమెరికా కాలమానం ప్రకారం ఈ గ్రహణం మధ్యాహ్నం 2:15 గంటలకు ప్రారంభమవుతుంది. అంటే పట్టపగలే చిమ్మచీకటి ఆవరిస్తుందన్నమాట.
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం మొత్తం 4 గంటల 25 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఇది 50 ఏళ్లలో సుదీర్ఘ సమయం. భూమి దాదాపు 8 నిమిషాల పాటు పూర్తి చీకటిలో ఉంటుంది. అమెరిక ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. గ్రహణం సమయంలో పొరపాటున కూడా సూర్యుని వైపు నేరుగా చూడకూడదు. ఇలా చేయడం వల్ల సూర్యుడి హానికరమైన కిరణాల వల్ల కళ్లు దెబ్బతింటాయి. ఇందుకోసం టెలిస్కోప్ లేదా ప్రత్యేక సన్ గ్లాసెస్ సహాయంతో కూడా చూడవచ్చు.
Discussion about this post