ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో INTUC నగర అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి SK.అబ్దుల్ జలిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట వ్యాప్తంగా INTUC అధ్యక్షులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం అని తెలిపారు. INTUC గుర్తింపు లోగోను అడ్డుపెట్టుకొని భోగస్ కమిటీలతో ప్రజలను, కార్మికులను మోసం చేస్తున్నట్లు చెప్పారు. 16న ట్రేడ్ యూనియన్స్ పిలుపు మేరకు బంద్ కి సహకరించాలని కోరారు.
Discussion about this post