ఇరాన్‌పై యుద్ధం త్వరలో ముగుస్తుంది.. ట్రంప్ సంచలనం !

ఒకవైపు యుద్ధ జ్వాలలు.. మరోవైపు అగ్రరాజ్యం హెచ్చరికలు.. వీటన్నింటి మధ్య ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్‌ వచ్చాడు! అమెరికా హెచ్చరికలను భేఖాతరు చేస్తూ..

ఇజ్రాయెల్ క్షిపణులకు సవాల్ విసురుతూ.. ఇరాన్‌ తీసుకున్న నిర్ణయానికి రష్యా మద్దతు తెలిపింది. ఖమేనీ వారసుడు రాకతో పశ్చిమాసియా రణరంగంలో మారిన సమీకరణాలేంటి? యుద్ధం ముగుస్తుందా.. లేక ముదురుతుందా?

ఇజ్రాయెల్‌, అమెరికాతో యుద్ధం భీకరంగా సాగుతున్న వేళ ఇరాన్‌ తన కొత్త సుప్రీం లీడర్‌ను ఎన్నుకుంది. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఖమేనీ రెండో కుమారుడు మొజ్తాబా ఖమేనీని కొత్త సుప్రీం లీడర్‌గా ప్రకటించింది.

ఇరాన్‌లోని 88 మంది మత గురువులతో కూడిన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్‌పర్ట్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ కొత్త సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీకి మద్దతుగా వేలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని సెంట్రల్ స్క్వేర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజలు.. కొత్త సుప్రీం లీడర్‌కు విధేయులమైన ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఇదిలా ఉండగా.. పశ్చిమాసియా యుద్ధంపై అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో ఇరాన్‌లో యుద్ధం ముగుస్తుందని వ్యాఖ్యానించారు. ఇరాన్‌లో 5 వేల లక్ష్యాలను ఛేదించినట్లు తెలిపారు.

ఇరాన్‌లో జరిగింది కేవలం స్వల్పకాల సైనిక చర్య మాత్రమే అని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనన్నారు. యుద్ధం పట్ల పుతిన్ సంతృప్తిగానే ఉన్నారని తెలిపారు. ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తాబా నియామకం నిరాశపరిచిందన్నారు.

ఇరాన్‌తో యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. యుద్ధాన్ని ఎప్పుడు ముగించాలో తాము నిర్ణయిస్తామని కౌంటర్ ఎటాక్ చేసింది. ఈ మేరకు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ ఒక ప్రకటనలో పేర్కొంది. యుద్ధం ముగిసే సమయాన్ని నిర్ణయించేది తామేనని స్పష్టం చేసింది. భవిష్యత్ పరిణామాలు ఇప్పుడు తమ సైనికుల చేతిలో ఉన్నాయని.. కాబట్టి అమెరికా సైన్యం యుద్ధాన్ని ముగించలేరని పేర్కొంది. గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యాడు. దీంతో అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారంగా ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. అంతేకాకుండా హర్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో చమురు, గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితి సంక్షోభం దిశగా వెళ్తోంది.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top