జంటనగరాల ఆసుపత్రుల సరఫరాదారులు : ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించకపోతే ప్రభుత్వాసుపత్రులతో పాటు ఇఎస్ఐ ఆసుపత్రికి కూడా అత్యవసర మందులు సరఫరా చేయలేమని జంటనగరాల ఆసుపత్రుల సరఫరాదారుల సంఘం స్పష్టం చేసింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాంచందర్ మాట్లాడుతూ గాంధీ, ఉస్మానియా నిమ్స్, నిలోఫర్‌తోపాటు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, కార్మికుల కోసం నిర్వహిస్తున్న ఈఎస్ఐ ఆసుపత్రులకు మందులు, వైద్య పరికరాలు సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు విడుదల చేయాలని రాంచందర్ డిమాండ్ చేశారు.
Discussion about this post