ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో ఇద్దరు న్యాయమూర్తులు ప్రమాణం చేశారు. జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనర్సింహ చక్రవర్తి,జస్టిస్ తల్లాప్రగడ మల్లిఖార్జున రావులచే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయించారు.
కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, AP హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఘంటా రామారావు,AP హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జానకి రామిరెడ్డి, రిజిష్ట్రార్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.
Discussion about this post