రాష్ట్రంలో రెండవసారి వైసీపి అధికారంలోకి వస్తుందని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమ శంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన ఉమా శంకర్ నియోజక వర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో కార్యకర్తలు, నేతలతో కలిసి ముమ్మరం ప్రచారం చేస్తున్నారు. గ్రామా గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోసారి జగ్మోహన్ రెడ్డిని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చేస్తోన్న కృషి తెలియజేస్తున్నారు.
Discussion about this post