బాధ్యతలు స్వీకరించిన గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రోటెం స్పీకర్ అక్బరుద్దీ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ పేరును అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి , మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కలిసి స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను గౌరవ పూర్వకంగా ఆయన కుర్చీలో కూర్చోబెట్టారు. అనంతరం ఎమ్మెల్యేలు ఆయనకు అభినందనలు తెలియజేశారు.
అసెంబ్లీ స్పీకర్‌గా తొలి సారి దళిత నేతను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది. గడ్డం ప్రసాద్ తన రాజకీయ ప్రస్థానాన్ని ఎంపీటీసీగా తొలి అడుగు వేసి ప్రారంభించారు .. నేడు శాసనసభాపతిగా ఎన్నికయ్యారు. ఈయన 21 ఏళ్ల ప్రాయంలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఈయన 1964లో మర్పల్లిలో జన్మించారు. 1984లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.. 2008 ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వికారాబాద్‌లో అఖండ విజయాన్ని సాధించారు.
2009లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2014, 2018 ఎన్నికల్లో వరుసగా ఓటమి చవిచూసారు. 2022లో టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ ని నియమించింది.2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నుంచి పోటీచేసి మరోసారి గెలుపొందారు.
Discussion about this post