యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సందర్శించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ హరిచందన, ఎస్పీ చందనా దీప్తి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
గత ప్రభుత్వంలో ఉన్న అలవాట్లను, పద్ధతులను అధికారులు మార్చుకోవాలని, త్వరితగతిన ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించారు. పవర్ ప్రాజెక్ట్ జాప్యం కారణంగా రాష్ట్ర ఖజానాపై మోయలేని భారం పడిందని తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు వేగవంతం చేసేందుకే క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నామని,
ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, పవర్ ప్రాజెక్ట్ ద్వారా స్థానికలకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని అన్నారు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు జరిగితే ఉపేక్షించేది లేదని చెప్పారు.
Discussion about this post