బీఆర్ఎస్ పాలనలో ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు : లక్షల కోట్ల సంపదను దోచుకున్న గత ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. త్వరలో నిరుద్యోగులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. నిదానపురంలో 20 లక్షలతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్ర భవనాన్ని ప్రారంభించారు.
Discussion about this post