తప్పిపోయిన రెండు సంవత్సరాల బాలుడిని ఒక గంట వ్యవధిలోనే పట్టుకొని తల్లికి అప్పచెప్పిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చంద్రయనగుట్ట ఇస్మాయిల్ నగర్ కు చెందిన ఎండీ మరియంబి సోమవారం సాయంత్రం 5 గంటలకు తన కుమారుడు ఎండి అన్వాస్ రామంతపూర్ కేసీఆర్ నగర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గర తప్పిపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ పెట్రోలింగ్ సిబ్బందిని అలర్ట్ చేసి స్థానికుల సహకారంతో ఒక గంట వ్యవధిలోనే రెండు సంవత్సరాల బాలుడిని పట్టుకొని సీఐ ఎలక్షన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది బాలుడి తల్లికి అప్పజెప్పారు. ఉన్నతాధికారులు సీఐ ఎలక్షన్ రెడ్డిని, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
Discussion about this post