రాజకీయం శృతిమించి భారతీయ సంస్కృతిని బజారుకీడుస్తోంది. నేనే అర్జనుడు, నేనే కృష్ణుడు అంటూ పొలికట్ పంచ్ డైలాగులు రాజకీయ సభలలో పేలుతున్నాయి. తమ కంటూ నిర్థిష్టమైన మత విధానంలో కొనసాగుతున్న వ్యక్తుల సైతం దేవాతా మూర్తులుగా అభివర్ణించుకుంటూ సభలకు వచ్చిన జనాన్ని మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయాల కోసం మత విశ్వాసాలను పక్కన పెట్టి, నాయకులు అనుసరిస్తున్న తీరు ఎన్నికల కమీషన్ నియమావళిలోకి వస్తుందో లేదో తెలియదు కాని సభ్య సమాజం తలదించుకునేలా మాత్రం చేస్తోంది.
అర్జనుడు ఆద్యుడు, ఆరాధ్యుడు, పిడుగు పాటు శబ్ధం వినిపిస్తేనే అర్జునా పల్గుణా, పార్థా కిరీటీ అంటూ ఆరాధించే దైవికమైన వ్యక్తి. దేశ ఆలయాలయాలలో పాండవులు పూజలు అందుకొంటోన్న దైవాలు. చరిత్రలో ధర్మ నిరతి కలిగిన ఆదర్శనీయులు ధీరశాలలు. భక్తి విశ్వాసాలకు ప్రతీకగా భావించే వారిని పోల్చుకొని పొలిటికల్ ఫంచ్ డైలాగులు చెప్పడం ఎన్నికల కమిషన్ అభ్యంతరం పలికాల్సిన అంశం. ఈ విధానమే కొనసాగితే దేవతా మూర్తులు, మత ప్రతీకులకు కూడా ఎన్నికల వేళ ముసుగులు వేయాల్సిన పరిస్థితి దాపురిస్తుంది.
గతంలో స్వాతంత్ర సమర యోధులకు ఎన్నికల వేళ ముసుగులు తొడిగేవారు కాదు. కాని ఇప్పుడు గాంధీమహాత్ముడు, శివాజీ, సుభాస్ చంద్రబోస్, సర్థార్ వల్లభాయి పటేల్, శ్రీక్రిష్ణ దేవారాయు, జాన్సీభాయి వంటి మహానుభావుల విగ్రహాలకు ముసుగులు పడ్డాయి. ఇప్పుడు రాజకీయ నాయకుల కన్ను పురాణ పురుషల వైపు మళ్లింది. భారత, భాగవతాలలోని సందర్భాలను ఉదహరించి పొలిటికల్ పంచ్ డైలాగులను రాజకీయ నాయకులు చెబుతున్నారు. నేను అర్జనుడిని, కృష్ణుడిని, ప్రత్యర్థులు కౌరవులు, మరొకరు దుష్టచతుష్టయాలు అంటూ ఓటర్లను పెద్దయెత్తన ప్రభావితం చేసే పోకడలకు తెరలేపారు. గతం కంటే ప్రమాదంగా ముసుగు వేసేందుక కూడా వీలు లేని పార్ములాను రాజకీయ నాయకులు వెలికి తీశారు.
పంచ్ లు పేలేందు ప్రత్యర్థులను కౌరవులతో పోల్చుతోన్న సందర్భాలున్నాయి. ఆమాటకి వస్తే కౌరవులు సంఘ విద్రోహులు కాదు. కర్ణుడు ధానగుణ శీలిగా స్మేహ ధర్మానికి కట్టుబడిన ఆదర్శనీయుడు. భీష్ముడు భరత జాతికి పితామహులు. ధుర్యోధనుడు కూడా ప్రజా కంఠకుడు కాదు. మంచి పరిపాలను అందించన రారాజు. రాజ్యాధికారాన్ని పొందటంలో సక్రమం కాని విధానం కురుక్షేత్ర యుద్దానికి దారి తీసింది. రాజకీయ రాజగురువులు ఎన్నికల ప్రసంగాలలో పంచ్ లు పేల్చేందుకు అక్షరాలను కూర్చినా స్వార్థపూరిత అలోచనలు, అధికార కాంక్షతో కూడు కొన్న నేటి తరం నాయకులు పురాణ పురుషులతో పోల్చుకోవడం అభ్యతరక మనడంలో అతిశయోక్తి లేదు.
దేవతా మూర్తుల వేషాలతో కటౌట్ లు ప్లెక్సీలు ఏర్పాటు చేయడం గతంలో విచ్చలవిడిగా సాగింది. సినిమా యాక్టర్లు రాజకీయలలోకి వచ్చాక వారు నటించిన క్యారెక్టలలోని పురాణపరుషల వేషధారణలతోనే ప్రచారాలను సాగించి ఓటర్లను ప్రభావితం చేసేవారు. ఎన్టీఆర్ రాముడు, క్రిష్ణుని వేషధారణ ఇట్టే ఆకట్టు కొనేలా ఉండేవి. ఎన్నికల కమిషనర్ శేషన్ కొంత మేరకు చైతన్య పరిచి ఈ పోకడలకు అడ్డుకట్టకవేశారు. విగ్రహాలు కావడంలో ముసుగులు తొడిగించారు. భగవంతుని ఆరాదనకుకు భంగం వాటిల్లకుండా పుజా పునస్కారాల విధానం కొనసాగుతోంది. ప్రజాధర ఉన్న ఆలయాల ద్వారా ఎందరో ఉపాధిని పొందుతోన్నారు.
పురాణ పురుషులను పొలిటికల్ పంచ్ డైలాగుకు వాడు కోవడం ఎంత మాత్రం సహాజహితం కాదు. కమిషన్ ఈ విషయాన్ని పరిగణలోకి తసుకోవాల్సిన అవసరముంది.
Discussion about this post