కల్వకుర్తి నుంచి మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఓటు హక్కును మార్చుకున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచందర్ రెడ్డి తెలిపారు. పాలమూరు న్యాయయాత్ర, ప్రచారంలో తనపై చూపిన ఆదరణను దృష్టిలోఉంచుకొని మార్చుకున్నట్లు ఆయన తెలిపారు.
ఇదే విధంగా పార్టీ కార్యకర్తలు ప్రజలు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చి ఎంపీగా గెలిపిస్తే జీవితాంతం పాలమూరు ప్రజలకు రుణపడి ఉంటారన్నారు. పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని వంశీచందర్ గట్టి పట్టుదలతో ఉన్నారు.
Discussion about this post