ఇఫ్తార్ విందు ఆత్మీయతకు, మత సమరస్యానికి ప్రతీక అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. గ్రేటర్ వరంగల్ 43వ డివిజన్ మామూనూరు లోని హెచ్ఆర్ఎస్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాల్గొన్నారు. ముస్లిం సోదర సోదరిమనులందరికి నాగరాజు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో నిర్వహించే ఇఫ్తార్ విందులకు ఎంతో ప్రముఖ్యత ఉందని అన్నారు.
Discussion about this post