ఏపీ ఎన్నికల్లో హిందూపురం నుంచి ఈ సారి కూడా బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇది వరుసగా మూడోసారి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలవడం. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యేగా బాలయ్య హ్యాట్రిక్ కొట్టడంతో తెలుగుదేశం అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బాలకృష్ణకు సినీ పరిశ్రమ నుంచి, అభిమానుల నుంచి అభినందనలు వెలువెత్తుతున్నాయి. ఇక అభిమానులు పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టి దండలు వేసి బాలయ్య హ్యాట్రిక్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో హిందూపురంలో బాలయ్య అభిమానులు మాస్ సెలబ్రేషన్స్ చేశారు. బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ హిందూపురంలో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసి…ఆ ఫ్లెక్సీకి గజమాలతో పాటు పొట్టేలు తలకాయలతో తయారుచేసిన దండ కూడా వేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బాలయ్యకు ఈ పొట్టేలు దండ వేయడం చూసి ఆశ్చర్యపోతూ ఇదెక్కడి మాస్ సెలబ్రేషన్స్ రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.
Discussion about this post