తీరప్రాంత గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ ఆర్థిక సహాయం చేశారు. ఆయన మేలు మరచిపోలేమని సొర్లగొంది గ్రామస్తులు అన్నారు. పెదపాలెం ఛానెల్ నాలుగేళ్లుగా పూడిక తీయకపోవడంతో చివరి గ్రామలైన దీనదయాళపురం, సొర్లగొంది, దిండి, పుల్లయ్యగారి దిబ్బ గ్రామ పంట పొలాలకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. చేతికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని తెలుసుకున్న పారిశ్రామికవేత్త విక్కుర్తి శ్రీనివాస్ సొంత నిధులు వెచ్చించి కాలువ మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా రైతులు శ్రీనివాస్‌ని ఘనంగా సత్కరించారు.
Discussion about this post