గ్రామ ప్రథమ పౌరుల పదవీకాలం మరో 10 రోజుల్లో ముగియనుంది. సర్పంచుల పదవీకాలం ముగిస్తుండడంతో… కొందరు వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్దపడుతున్నారు. మరికొందరు లక్షల్లో అప్పులు చేసి… చేపట్టిన పనులకు బిల్లులు రాకపోవడంతో…ఆ బిల్లులే వారి పాలిట శాపంగా మారాయని వాపోతున్నారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో పెండింగ్ బిల్లుల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో చేపట్టిన క్రీడా ప్రాంగణాలు, స్మశాన వాటికలకు సంబంధించిన బిల్లులు లక్షల్లో ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు.
Discussion about this post