అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, పంటలకు క్వింటాలుకు 500 మద్దతు ధర పెంచాలని నిజామాబాద్ బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నిజామాబాద్ లోక్ సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో కలిసి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ… జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తుందని అన్నారు. గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను పంపాలని చెప్పారు.
Discussion about this post