తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఆదివారం రాత్రికి తీవ్ర తుఫానుగా బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మధ్య తీరం దాటనుందని వెల్లడించింది. ఈ క్రమంలో.. కోస్తాలోని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రధాన హెచ్చరికను విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం జారీ చేసింది. తీవ్ర వాయుగుండం ప్రస్తుతం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ ఉందని తెలిపింది. పశ్చిమ మధ్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయని.. వాటి ప్రభావంతో కోస్తా లోను వాతావరణం చల్లబడిందని అంటున్న విశాఖ వాతావరణ శాఖ డైరెక్టర్ సునంద.
Discussion about this post