విశాఖలో నేరాలు అదుపులో లేకుండా పోయాయని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. నియోజక వర్గ పరిధిలోని గోపాలపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సనవేశంలో గణబాబు మాట్లాడారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు భూములు ఇవ్వాలని కోరిన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతుందన్నారు. పర్యాటక ప్రాంతంగానో, పోర్ట్ సిటీగానో ఉండాల్సిన విశాఖ… ఈ నాలుగున్నరేళ్ల కాలంలో గంజాయి సిటీగా మరిపోయిందన్నారు. పోలీస్ వ్యవస్థకు చెందిన వారే గంజాయిని తీసుకువెళ్లడం చూస్తుంటే శాంతి భద్రతల పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుందని అన్నారు.
Discussion about this post