విశాఖ ద్వారక పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్టానికంగా కలకలం రేపింది. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీపురం ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ శంకరరావు ఈ రోజు తెల్లవారుజామున ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతుడు శంకరరావుకి భార్య ,ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆర్థిక ఇబ్బందుల కారణంగా శంకరరావు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చాన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Discussion about this post