సంక్రాంతి సందర్భంగా రైలు ప్రయాణీకులతో విశాఖలోని రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. విశాఖ రైల్వే స్టేషన్ లో సాధారణ రోజుల కంటే మూడురెట్లు తాకిడి పెరిగింది. విశాఖ మీదుగా పక్క జిల్లాలకు వెళ్లే ప్రయాణీకులు గోపాలపట్నం రైల్వే స్టేషన్ ను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలు ,కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో సంక్రాంతి పండుగకు పిల్లా పాపాలతో సొంత ఊళ్లకు చేరుకునేందుకు ప్రయాణీకులు రైల్వే స్టేషన్ చేరుకుంటున్నారు. రైళ్లన్నీ రద్దీగా ఉండడంతో చిన్నపిల్లలతో ప్రయాణం చేసేందుకు వారంతా నానా అవస్థలు పడుతున్నారు. రెండు మూడు నెలల క్రితం రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ… ఫలితం లేదని, రిజర్వేషన్ బోగీలు కూడా అన్ రిజర్వుడు బోగీలుగా కనబడుతున్నాయన్న ప్రయాణికులు
Discussion about this post