మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘విశ్వంభర’. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకుందీ మూవీ. లేటెస్ట్ గా ఓ పాట చిత్రీకరణ జరపబోతున్నారట. వచ్చే షెడ్యూల్లో ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ షూటింగ్ జరగబోతుందని తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం హైదరాబాద్ శివార్లలో ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారట. ఈ సాంగ్‌లో మెగాస్టార్ చిరంజీవి తన అద్భుతమైన డాన్స్ మూవ్‌మెంట్స్‌తో మెస్మరైజ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. ‘విశ్వంభర’ చిత్రానికి ‘జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి’ తరహాలో సోషియో ఫాంటసీ టచ్ ఇస్తూనే.. ‘హిట్లర్’ సినిమా తరహాలో సిస్టర్ సెంటిమెంట్ ను హైలైట్ చేస్తున్నాడట డైరెక్టర్ వశిష్ట. యు.వి.క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ‘విశ్వంభర’ చిత్రానికి ఆస్కార్ విజేత కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. వచ్చే సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ విడుదలకు ముస్తాబవుతోంది. అంతేకాక చిరంజీవి దొరబాబు అనే పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అదేవిధంగా హీరోయిన్గా నటిస్తున్న త్రిష ద్విపాత్రాభినయం చేస్తుందని తెలుస్తుంది. భూలోకానికి చెందిన సామాన్యరాలుగా, అలాగే దేవలోకానికి చెందిన దేవకన్యగాను కనిపించనుందని అంటున్నారు. ఈ రెండు పాత్రల్లో త్రిష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలుస్తుందని సమాచారం.మరి విశ్వంభర ఎలా ఉంటుందో చూడాలి.
Discussion about this post