నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ డ్యాంను… నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధారిటి సభ్యులు మూడు రోజులపాటు పరిశీలించనున్నారు. వివేక్ త్రిపాఠి ఆధ్వర్యంలో 13 మంది సభ్యుల బృందంతో నాగార్జునసాగర్ డ్యామ్ పరిశీలించారు. డ్యాం సేఫ్టీ, స్పిల్ వే, నీటి నిల్వలు,తదితర అంశాలపై ఆరా తీశారు. బుధవారం డ్యామ్ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో CWC సభ్యులు, నేషనల్ సేఫ్టీ అథారిటీ, కృష్ణ రివర్ బోర్డు సభ్యులు, ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.
Discussion about this post