మచిలీపట్నంలో వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను ఈసీ దూరంగా పెట్టడంతో… మనస్తాపానికి గురై రాజీనామా చేస్తునట్లు చెప్పారు. తమ రాజీనామాలను మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు. బందరు నియోజకవర్గంలో పన్నెండు వందలకు పైగా వాలంటీర్లు విధులను నిర్వర్తిస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందిస్తూ… గత 50 నెలలుగా నిస్వార్ధ సేవలందిస్తున్నామని, రాజకీయాలకు ప్రభావితం కాకుండా సేవలందిస్తున్నామని వాలంటీర్లు చెప్పారు. తమ సేవలకు రాజకీయాలు ఆపాదించి ఈసీకి ఫిర్యాదు చేశారని…
దీనికి తామంతా మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నామని అన్నారు.
Discussion about this post