ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ఇంటి వద్ద నుంచే ఓటింగ్ హక్కును కల్పిస్తున్నారు. హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ వినియోగంపైన తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఎన్నికల్లో 85 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతానికిపైగా అంగవైకల్యం ఉన్నవారు పోలింగ్ స్టేషన్ కు వచ్చిగానీ, ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో తొలిసారి హోమ్ ఓటింగ్ విధానాన్ని ప్రవేశ పెడుతున్నారు
Discussion about this post