శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ కు సంబంధించిన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ సూచించారు.. వరంగల్-ఖమ్మం-నల్గొండ శాసనమండలి పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం స్థానిక ఎస్ఆర్ అండ్ బిజీఎన్ఆర్ కళాశాలలో చేపట్టిన ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. రూట్ల వారిగా ఎన్నికల సామాగ్రి పంపిణీకి ఏర్పాటుచేసిన టేబుళ్లు, టేబుళ్లపై పోలింగ్ కేంద్రాల సంఖ్య, పోలింగ్ సిబ్బందికి చేపట్టాల్సిన వసతుల గురించి అధికారులకు సూచనలు చేశారు.
Discussion about this post