Water Bottle Cleaning Tips: వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్ చేస్తే 5 నిమిషాల్లో తళతళలాడాల్సిందే!

చాలా మంది ఇంట్లో కూడా బాటిల్ వాటర్ తాగుతారు. కానీ చాలా మంది దాని శుభ్రత గురించి పట్టించుకోరు. బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది. క్రమంగా అది దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది. అలాంటి బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై..

Water Bottle Cleaning Tips: వాటర్‌ బాటిల్‌ ఇలా క్లీన్ చేస్తే 5 నిమిషాల్లో తళతళలాడాల్సిందే!

Water Bottle Cleaning Tips

నేటి ఉరుకుల పరుగుల జీవనశైలిలో ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా తమతో పాటు ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటారు. చాలా మంది ఇంట్లో కూడా బాటిల్ వాటర్ తాగుతారు. కానీ చాలా మంది దాని శుభ్రత గురించి పట్టించుకోరు. బాటిల్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే బ్యాక్టీరియా పేరుకుపోతుంది. క్రమంగా అది దుర్వాసన రావడం ప్రారంభిస్తుంది.

అలాంటి బాటిల్‌లో నీళ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. అందువల్ల వాటర్ బాటిల్‌ను సరిగ్గా శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. వాటర్ బాటిల్ చెడు వాసన సులభంగా వదిలించుకోవాలంటే ఈ కింది చిట్కాలు అనుసరించండి..

ఉప్పు – నిమ్మరసం

ఉప్పు, నిమ్మరసం మిశ్రమం వాటర్‌ బాటిల్‌ మురికిని తొలగించడంలో మాత్రమే కాకుండా బాటిల్ దుర్వాసనను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. దీని కోసం ముందుగా కొంచెం వాటర్‌లో ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఆ తరువాత కొంచెం బాటిల్‌లోపోసి బ్రష్‌తో బాటిల్‌ను బాగా స్క్రబ్ చేయాలి. కొంత సమయం తర్వాత శుభ్రం చేసుకుంటే సరి. ఇది మురికి, వాసన రెండింటినీ తొలగిస్తుంది.

వెనిగర్ – బేకింగ్ సోడా

వాటర్ బాటిల్‌లో మరకలను తొలగించడానికి ముందుగా ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు పోసి బాటిల్ కు వేసి మూత పెట్టాలి. ఆ తర్వాత బాటిల్ ను బాగా కదిలించాలి. దాదాపు 10 నుండి 15 నిమిషాల తర్వాత వాటర్ బాటిల్ ను కడిగి శుభ్రం చేసుకోవచ్చు. ఈ పద్ధతి వాటర్ బాటిల్ నుంచి మురికి, దుర్వాసన రెండింటినీ వదిలిస్తుంది.

బేకింగ్ సోడా – ఉప్పు

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో బేకింగ్ సోడా, చిటికెడు ఉప్పు కలపాలి. ఆ నీటితో బాటిల్ నింపాలి. తరువాత బ్రష్ లేదా స్క్రబ్బర్ తో లోపలి భాగాన్ని స్క్రబ్ చేసి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతి బాటిల్ మురికి, దుర్వాసనను పూర్తిగా తొలగిస్తుంది.

గ్రీన్ టీ బ్యాగ్

టీ బ్యాగులు బాటిల్దుర్వాసనను తొలగించడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇందుకోసం బాటిల్‌ను నీటితో నింపి దానిలో ఒక టీ బ్యాగ్‌ను ఉంచి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం బాటిల్‌ను బాగా శుభ్రం చేస్తే వాసన పోతుంది. ఇలా వారానికి ఒకసారి బాటిల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి.

Follow for more updates

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top