నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిజాంసాగర్ కాలువ తెగిపోయింది. తెల్లవారుజామున పట్టణ కేంద్రంలో నిజాంసాగర్ ప్రధాన కాలువ కట్ట తెగిపోయింది. దీంతో కాలువను ఆనుకొని ఉన్న జర్నలిస్టు కాలనీలోకి నీరు వచ్చిచేరింది. అర్థరాత్రి వేళ ఒక్కసారిగా నీరు ఇండ్లలోకి రావడంతో కాలనీవాసులు పరుగులు పెట్టారు. నీటి ప్రవాహానికి విద్యుత్ స్తంభాలు కింద పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.అయితే కాలువ తెగిపోవడానికి ఇరిగేషన్ అధికారుల నిరక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Discussion about this post