కేసీఆర్ హయాంలో నాలుగేళ్లలోనే కాళేశ్వరం వంటి నీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని, అందువల్లే చెరువుల్లో నీరు నిండా ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. సిద్దిపేట పట్టణంలోని గణేష్ నగర్ లో నిర్మించిన శ్రీరామ కళ్యాణ మండపాన్ని, మండల కేంద్రం చిన్నకోడూరులో నిర్మించిన గౌడ కమ్యూనిటీ హాల్ ను ఆయన ప్రారంభించారు. మహిళకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమాల్లో హరీష్ రావు మాట్లాడుతూ గతంలో 30 ఏళ్ల వరకు ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి కాదని, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా జరిగిందని చెప్పారు. గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేశామని, వైన్స్ టెండర్లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు ఇచ్చామని హరీష్ రావు పేర్కొన్నారు.
Discussion about this post