రాష్ట్రంలోని ప్రతి శాఖ పై శ్వేత పత్రం విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.. సిద్దిపేట కు మొదటిసారిగా వచ్చిన పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం లో మాటాడుతూ మారుమూల ప్రాంతాలకు కూడా బస్సులు నడుపుతామన్నారు. అనంతరం రంగదాంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు.
Discussion about this post