మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డిలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వారినకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…BRS పార్టీకి చెందిన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు…కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూసి ఆకర్షితులయ్యారని, కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
Discussion about this post